బుద్దుడు స్వ‌యం ప్ర‌కాశితుడు 

బుద్దుడు స్వ‌యం ప్ర‌కాశితుడ‌య్యార‌ని, ఆయ‌న జీవితం ఎంతో మందికి జీన‌వవెలుగును ప్ర‌స‌రించింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్ర‌జ‌ల‌కు బుద్ద‌పూర్ణిమ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి  వీడియో ప్ర‌సంగం చేసారు.   ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో తాను నేరుగా బుద్ద‌పూర్ణిమ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేక‌పోతున్న‌ట్లు విచారం వ్యక్తం చేశారు. 

భార‌తీయ నాక‌రిక‌త‌, సాంప్ర‌దాయాల వృద్ధి కోసం గౌత‌మ బుద్దుడు ఎంతో చేశారని ప్రధాని కొనియాడారు.   జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధాన‌మే భార‌త సంస్కృతిని ముందుకు న‌డిపిందని ప్రధాని పేర్కొ‌న్నారు. 

క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో అనేక మంది 24 గంట‌లు ఇత‌రుల కోసం ప‌నిచేస్తున్నార‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, వైర‌స్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నార‌ని, పారిశుద్ధం పాటిస్తున్నార‌ని, వారంతా త్యాగ‌మ‌య జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. 

వారంద‌రినీ ప్రోత్స‌హించాల్సిన‌, గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రధాని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికి అండ‌గా ఉండేందుకు ప్ర‌తి ఒక‌రూ నిలుచున్నార‌ని, ఎటువంటి వివ‌క్ష లేకుండా స‌హాయం చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు స‌హ‌క‌రించేందుకు భార‌త్ నిత్యం ప‌నిచేస్తున్న‌ద‌ని ప్రధాని స్పష్టం చేశారు. 

అల‌సిపోయిన త‌ర్వాత ఆగిపోతే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఉండ‌ద‌ని చెబుతూ అంద‌రం క‌లిసి క‌రోనాను ఓడించాల‌ని మోదీ ఈ సంద్రాభంగా పిలుపిచ్చారు.