తెలంగాణ గ్రామాలలో ఒక దుకాణాలు ఓపెన్ 

ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించుకోవాలంటూ కేంద్రం చెప్పిన మార్గదర్శకాలను తుచ తప్పకుండా అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అయితే, వాటిని ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లకు మాత్రమే పరిమితం చేస్తామని, రెడ్‌జోన్లలో నిబంధనలు కఠినంగానే అమలవుతాయని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ సంస్థలన్నీ పనిచేస్తాయని, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్ టి ఓ కార్యాలయాలు రెడ్ జోన్ లతో సహా తెరుచుకుంటాయని వెల్లడించారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే వీటిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 

భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతధంగా చేసుకోవచ్చు. కాకపోతే భౌతికదూరం పాటించాలని తెలిపారు. మైనింగ్, భవన నిర్మాణంకు అవసరమైన షాపులు తెరుచుకోవచ్చని చెప్పారు. వాహనాల యొక్క రిజిస్ట్రేషన్లు యథాతథంగా అమలు జరుగుతాయని వెల్లడించారు.  

గ్రామీణ ప్రాంతాలలో అన్ని షాపులను తెరుచుకోవచ్చని కేసీఆర్ ప్రకటించారు. మునిసిపల్ ప్రాంతాలలో మాత్రం రోజుకు సగం చొప్పున రోజు విడిచి రోజు షాపులను తెరుచుకోవచ్చని తెలిపారు. 

వ్యవసాయరంగ పనులు యథాతథంగా కొనసాగుతాయని చెబుతూ వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, స్పేర్‌ పార్ట్స్‌ షాపులు ఎక్కడున్నా సరే అనుమతిస్తారని స్పష్టం చేశారు. ఫర్టిలైజర్‌ షాపులు, పెస్టిసైడ్స్‌, సీడ్స్‌ షాపులు తెరిచి ఉంటాయి. నిత్యావసర షాపులు ఓపెన్‌గా ఉంటాయి. దాంతోపాటు సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్‌, గృహాలకు సంబంధించిన ఎలక్ట్రికల్‌ షాపులు కూడా తెరిచి ఉంటాయని ప్రకటించారు.  

రెడ్‌జోన్‌లోఉన్న హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతూ మొత్తం 1,096 కరోనా కేసు లుంటే ఈ జిల్లాల్లోనే 726 (66 శాతం) ఉన్నాయి. 29 మరణాలు సంభవిస్తే 25 మంది ఈ మూడు జిల్లాల్లోనే చనిపోయారు. తాజాగా నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్‌ఎంసీ నుంచే వస్తున్నాయని వివరించారు.