తెలంగాణలో అసాధారణ మరణాలు... వైద్యుల ఆందోళన 

తెలంగాణలో పరిస్థితి అదుపులోకి వస్తున్నదని, కరోనా మరణాలు దాదాపు తగ్గిపోయాయని ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రకటనలు అన్ని శుద్ధ అబద్దాలని రాష్ట్రంలోని పలువురు వైద్యులు కేంద్రానికి ఇచ్చిన నివేదికలో  గగుర్పాటు కలిగించే అంశాలను వెల్లడించినట్లు తెలుస్తున్నది. 

ప్రైవేట్ ఆసుపత్రిలలో అసాధారణ రీతిలో మరణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ వాటిని సరిగ్గ్గా పరిశీలిస్తే అవన్నీ కోవిడ్ మరణాలుగా తేలుతున్నాయని  స్పష్టం చేశారు. కరోనా మరణాలని ప్రభుత్వం గుర్తిచటం లేదని, చనిపోయాక కూడా టెస్టులు చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. 

ఈ మధ్య హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందంపై `డాక్టర్స్ ఫర్ సేవ' పేరుతో వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు సమర్పించిన నిపుణులు కరోనా వైరస్ గల రోగులు మిగిలిన ప్రజలతో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

చనిపయిన వ్యక్తి కుటుంబ సభ్యులకి కూడా టెస్టులు చేయటం లేదని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఐసిఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పక్కన పెట్టేస్తున్నట్లుతెలిపారు. కరోనా అనుమానంతో మృతి చెందిన వారికి పరీక్షలు జరపవద్దని ఆదేశిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్ 20న ఉత్తరువు జారీచేసిన్నట్లు వారు గుర్తు చేశారు.  

సూర్యాపేటలో ఒక్కరోజే 85 కేసులు రాగా, ఏప్రిల్ 23 నుండి ఆ తరువాత నుండి అక్కడ ఒక్క టెస్ట్ కూడా చేయలేదని, కనీసం పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులకి కూడా టెస్టులు చేయటం లేదని గుర్తు చేశారు.  ఏప్రిల్ 24 నుండి తెలంగాణలో దాదాపుగాటెస్టులు ఆపేసారని వెల్లడించారు. ఆ తర్వాత ఈ వైరస్ ఎంతమందికి రాష్ట్రంలో వ్యాపించిందో అంచనాకు కూడా అందడం లేదని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణా వలన పొరుగు రాష్ట్రాలతోపాటుగా దేశం కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నాయని యెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలు, మిగిలిన దేశం కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు కాబోతుందని పేర్కొన్నారు.

కేసులు పెరిగితే ప్రభుత్వాలకి అప్రదిష్ట అనే అభిప్రాయం తప్పని ఈ సందర్భంగా పౌర సమాజ ప్రముఖులు హితవు చెబుతున్నారు. ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య అని, ఇది మనం చేసిన తప్పిదం కాదని హితవు చెప్పారు.

దీనిని ఎదుర్కోవటానికి శాయశక్తులా ప్రయత్నం చేయకపోవటం మాత్రం ఖచ్చితంగా మన తప్పిదమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపయినా మనం సమాజానికి సమాధానం చెప్పక తప్పదని స్పష్టం చేశారు. 

ఉదాహరణకు ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోనే దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు ఉన్నప్పటికీ అక్కడ తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని గుర్తుచేస్తున్నారు.