ఏపీ వైపు దూసుకొస్తున్న 'ఎంఫాన్'‌ తుపాను

'ఎంఫాన్'‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తే  సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ వైపు భారీ తుపాను వచ్చే అవకాశం ఉన్న  నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  

'విద్యుత్‌, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని,  ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. 

తుపాను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, వర్షాలతో దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలని చెప్పారు.  కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకు కొనుగోలు చేయాలని' జగన్‌ అధికారులను ఆదేశించారు.