ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ మంత్రుల రాజకీయం 

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్  దృష్టికి తీసుకొస్తేమంత్రులు రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత, మాజీ మంత్రి డి కె అరుణ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ ఏవీ కింది స్థాయిలో జరగడం లేదని ఆమె మండిపడ్డారు. 

రాష్ట్ర మంత్రులు రాజకీయాలు చేస్తూ ముందు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే గోనె సంచులు ఇస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. తాము ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తూ సూచనలు చేస్తున్నామ‌ని, దాన్ని కూడా రాజకీయంగా చూస్తున్నారని అరుణ విస్మయం వ్యక్తం చేశారు. 

త‌మ‌ సూచనలు పాజిటివ్ గా తీసుకోకుండా నెగటివ్ గా బావిస్తున్నారని ఆమె విమ‌ర్శించారు. మీ మంత్రులెవ‌రూ రైతుల దగ్గరకు పోవడం లేదని, వారిని రాజకీయాలు చేయొద్దని చెప్పాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆమె హితవు చెప్పారు. రాజకీయాలు చేయదల్చుకుంటే మీ మంత్రులెవరు బయట తిరగ లేరని ఆమె హెచ్చరించారు.