గోప్యంగా, పకడ్బందీగా నడుస్తున్న శ్రామిక రైళ్లు 

దేశవ్యాప్తంగా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన 400కు పైగా గల ప్రత్యేక శ్రమిల్ రైళ్లను ఎంతో పకడ్బందీగా, ఒక విధంగా రహస్యంగా నడుపుతున్నది. లాక్ డౌన్ లక్ష్యానికి భంగం వాటిల్లకుండా, పెద్ద సంఖ్యలో కార్మికులు రైల్వే స్టేషన్  జాగ్రత్తలు పాటిస్తున్నది. 

అందుకోసమే రైళ్ళ వివరాలను బహిరంగంగా ప్రకటించడం లేదు. ఆ విధంగా చేస్తే వలస కార్మికులతో పాటు ఇతరులు సహితం రైల్ స్టేషన్లలో పెద్ద ఎత్తున గుమికూడి అవకాశం ఉంటుంది. జిల్లాకలెక్టర్లు, ప్రత్యేక నోడల్ అధికారుల పర్యవేక్షణలో జాబితాలు సిద్ధం చేసి వారిని రైల్వేష్టేషన్‌కు నిర్ణీత సమయంలో పిలిపించి రైలు ఎక్కించి మర్యాదపూర్వకంగా పంపిస్తున్నారు. 

రైల్వేశాఖ రహస్య మిషన్ మాదిరిగా వ్యవహరిస్తూ రైల్వేస్టేషన్లలో వలసకూలీలు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టి బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక రైళ్లలో పంపిస్తున్నారు. ఈ విషయంలో సంపూర్ణ సమాచారం కూడా రైల్వే అధికారులకు ముందస్తుగా అందడంలేదు. 

రైల్వే శాఖ ఈ విషయంలో గుంబనంగా వ్యవహరించేందుకు అనేక కారణాల ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో లక్షలాది వలసకార్మికులు రైల్వేస్టేషన్లలో గుంపులు గుంపులుగా చేరితే లాక్‌డౌన్ లక్ష్యానికి గండిపడే అవకాశాలు అధికంగా ఉండటంతో జాబితాలు రూపొందించి వలస కార్మికులకు సమాచారం అందిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా సుమారు కోటిమంది వలస కార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసే లోగా ప్రత్యేక చర్యలు తీసుకుని వారిని గమ్యస్థానాలకు చేరిస్తే లాక్‌డౌన్ అనంతరం ప్రయాణికుల ఒత్తిడి తగ్గించవచ్చనే ఎత్తుగడతోనే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదటి రైల్ తెలంగాణ నుండే ఝార్ఖండ్ కు వెళ్లడం గమనార్హం. 

ప్రతి రైల్ కు టిక్కెట్లను స్థానికి ప్రభుత్వ అధికారులకే అందజేస్తున్నారు. వారు తమ జాబితా ప్రకారం ఎంపిక చేసిన ప్రయాణికులకు వాటిని అందజేయవలసి ఉంటుంది. నేరుగా రైల్వే స్టేషన్ లలో టిక్కెట్ల జారీ అంటూ ఉండదు. ఈ రైళ్లు సుమారు 1200 మంది ప్రయాణికులతో, కనీసం 500 కిమీ దూరం ప్రయాణం చేస్తాయి. మధ్యలో ఎక్కడా ఆగవు. 

రైలు బయలుదేరే సమయంలోనే స్థానిక ప్రభుత్వ అధికారులు ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, భోజనం ప్యాకెట్ లను అందజేయవలసి ఉంటుంది. మధ్యలో ఒక భోజనాన్ని రైల్వే అధికారులు రైళ్లలోనే అందిస్తారు. ఒకొక్క రైలు 12 గంటలకు పైగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. 

ప్రయాణీకులు అందరు తప్పనిసరిగ్గా మాస్క్ లను ధరించవలసిందే. రైలు బయలుదేరే సమయంలోనే ప్రయాణికులు అందరు తమ మొబైల్ ఫోన్ లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్  చేసుకోవలసి ఉంటుంది.