ఏడాది చివ‌రిక‌ల్లా ఖచ్చితంగా వ్యాక్సిన్ 

ఈ ఏడాది చివ‌రి క‌ల్లా క‌చ్చితంగా కరోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భరోసా వ్య‌క్తం చేశారు. 2021 సంవ‌త్సరం రాక ముందే అమెరికాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్లడించారు. వ్యాక్సిన్ వ‌స్తుంద‌న్న అంశంలో న‌మ్మ‌కంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారీలో శాస్త్రవేత్తలు నిమ‌గ్న‌మై ఉన్నారు. అయితే ఆ వ్యాక్సిన్లు మాత్రం 2012 మ‌ధ్య కాలంలో అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. డాక్ట‌ర్ల లెక్క ప్ర‌కారం వ్యాక్సిన్ తొంద‌ర్లోనే వ‌స్తుంద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. 

దేశ‌వ్యాప్తంగా స్కూళ్ల‌ను, యూనివ‌ర్సిటీల‌ను సెప్టెంబ‌ర్‌లో తెర‌వాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోర‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వీలైనంత త్వ‌ర‌గా మ‌ళ్లీ గాడిలోప‌డే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. జ‌న‌వ‌రి 23వ తేదీన త‌న‌కు తొలిసారి నోవెల్ క‌రోనా వైర‌స్ గురించి అధికారులు తెలియ‌జేసిన‌ట్లు ట్రంప్ చెప్పారు.  

ఇక క‌రోనా వైర‌స్ వ‌చ్చింది వుహాన్‌లోని వైరాల‌జీ ల్యాబ్ నుంచే అని మ‌రోసారి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఆరోపించారు.  గ‌తంలో అధ్య‌క్షుడు ట్రంప్ చెప్పిన‌ట్లుగానే మ‌ళ్లీ పొంపియో ఈ వ్యాఖ్య‌లు చేశారు.