జోన్లు తగ్గినా పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్ నగరంలో కరోనా టెస్ట్ లు తగ్గిస్తున్నా, వైరస్ అదుపులోకి వస్తున్నదని అంటూ అధికారులు కంటోన్మెంట్ జోన్ లను తగ్గిస్తున్నా కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. : కంటెయిన్​మెంట్ జోన్లలో కరోనా కంట్రోల్​ అవుతోందని ​అనుకుంటుండగానే, ఆ పక్కనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

ఓవైపు పాత జోన్ తొలగిస్తుంటే, మరోవైపు ఆ దగ్గర్లోనే పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. హైదరాబాద్‌‌లో కంటెయిన్​మెంట్​ జోన్లు169 నుంచి 96కి తగ్గాయి. మొదట్లో జోన్ల విస్తీర్ణం కిలోమీటర్ పరిధిలో ఉంది. సిబ్బంది కొరత, నిర్వహణ ఇబ్బందులతో కుదించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి 100–200మీటర్లలోపే చిన్న జోన్లు పెట్టారు. అలాంటివి169 ఏర్పాటయ్యాయి. 

కేసుల్లేని చోట జోన్లను తొలగిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదవుతున్న చోట కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. పాత జోన్‌‌ పక్క ప్రాంతాల్లోనే కొత్తవి నమోదవుతుండడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు.  ఇటువంటి పరిస్థితి మలక్ పేట,  కూకట్‌‌పల్లి, ఖైరతాబాద్ సర్కిళ్లలో నెలకొంది. 

జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ అయితే అందరికి దడపుట్టిస్తున్నది. దేనికి పరిధిలోని మలక్ పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్లలో పాజిటివ్ కేసులు వచ్చాయి. కేసుల సంఖ్య 219కి చేరింది. ఇప్పటికే 50 కంటెయిన్​మెంట్ జోన్లు పెట్టారు.