దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు 

దేశంలో కరోనా కేసుల పెరుగుదల శాతం రోజు రోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 24 గంటల్లో 2,411 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మన దేశంలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి. 

దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 37,776కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 71 మంది చనిపోయారట. దీంతో నేటి వరకు కరోనా వల్ల మరణించిన భారతీయుల సంఖ్య 1,223కు చేరింది. అలాగే కరోనా బారిన పడి కోలుకున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నేటి వరకు 10,018 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని బయట పడ్డారని ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.  

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 11506 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత గుజ‌రాత్లో 4721 మందికి, ఢిల్లీలో 3738 మందికి వైర‌స్ సోకింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2719, రాజ‌స్థాన్ లో 2666, త‌మిళ‌నాడులో 2526, యూపీలో 2455 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఏపీలో 1525, తెలంగాణ‌లో 1057, ప‌శ్చిమ బెంగాల్ లో 795, పంజాబ్ లో 772 కేసులు న‌మోద‌య్యాయి.