ఏపీలో కరొనకు ఇళ్లలోనే చికిత్సలు 

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజు విస్తరిస్తూ ఉండడంతో కరోనా కట్టడి చేసేందుకు   కరోనా లక్షణాలు ఉండి, 50 ఏళ్ల లోపు వారికి ఇంట్లోనే చికిత్సలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ విషయమై పలు నిబంధనలతో వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. 

నిర్వహించే పరీక్షల్లో ఆరోగ్యాంగా ఉండాలని, వైద్యుని సిఫారసుతోనే మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ ఆసుపత్రికి సమీపంలో ఉండాలని, ,ఇంట్లో ప్రత్యేక వసతులు ఉండాలని తెలిపింది. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 75శాతం కేసుల్లో కరోనా లక్షణాలు బయటపడలేదు. ఇప్పటి వరకు ఉన్న 1403 కేసుల్లో 1050 కేసుల్లో లక్షణాలు కనిపించలేదు. వీరి ద్వారానే కరోనవైరస్ వ్యాప్తి చెందింది. వీరంతా 60 ఏళ్ల లోపువారుగా ప్రభుత్వం గుర్తించింది. 

అలాగే 20-40ఏళ్ల లోపువారు 44-45 శాతం ఉన్నట్లు అంచనా వేస్తోంది. కరోనా కట్టడికి భూతిక దూరం పాటించడమే పరిష్కారం అని నిర్ధారించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు లక్షకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 1.4శాతం తగ్గింది.

గత 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. గురువారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరింది. 

జిల్లాల వారీగా... కర్నూలులో 386, గుంటూరులో 287, కృష్ణాలో 246, నెల్లూరులో 84, చిత్తూరులో 80, కడపలో 73, అనంతపురంలో 61, ప్రకాశంలో 60, పశ్చిమగోదావరిలో 56, తూర్పుగోదావరిలో 42, విశాఖలో  23, శ్రీకాకుళంలో 5 కేసుల నమోదు అయ్యాయి. 

ఇలా ఉండగా విజయవాడ - గుంటూరు ల మధ్య రాకపోకలను నిషేధించారు. గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉన్న ఒక్కేఒక్క మార్గమైన కనకదుర్గ వారధిపై ఈ అంసుఖాలు విధించారు. 

కరోనా నేపధ్యంలో  జిల్లాలు మారకూడదని వాహనదారులకు ఆదేశాలు జారీ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అయితే అత్యవసర వాహనాలను, జిల్లా ఉన్నత అధికారులు జారీ చేసిన ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని తాడేపల్లి పోలీసులు తెలిపారు.