ఆయుర్వేదంతో పోలీసుల రోగనిరోదక శక్తి 

ఆయుర్వేదంతో పోలీసుల రోగనిరోదక శక్తిని పెంచేందుక ఢిల్లీ పోలీసులు, ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. 'కరోనా సే జంగ్‌ ఢిల్లీ పోలీస్‌ కే సంగ్' నినాదంగా ఆయురాక్షను ప్రారంభించారు. 

ఇది 15 జిల్లాల్లోని 80 వేల మంది ఢిల్లీ పోలీసులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కోవిడ్‌ 19 పోరాటంతో ముందుబాగంలో ఉన్న యోధులు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రతిపాదనతో ఆయుష్‌ మంత్రిత్వశాఖ సహాకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. 

ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో ముగ్గరు సమన్వయకర్తలు, 15 మంది నోడల్‌ అధికారులు, ఢిల్లీ పోలీసు తరపున ఒక సీనియర్‌ అధికారి సమన్వయ కర్తగా, 15 మంది నోడల్‌ అధికారులు ఉంటారు. దీనిపై ప్రత్యేక చోరువ తీసుకున్న ఆయుష్‌ కార్యదర్శి తనుజాకు ఢిల్లీ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. 

గడిచిన 20 రోజుల్లో 50 మంది ఢిల్లీ పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ఎక్కవగా ప్రభావం చూపించే షుగర్‌, బీపీ, టెన్షన్‌ వంటి ఆనారోగ్య పరిస్థితులను గుర్తించిందేకు ఏఐఐఏ ప్రణాళిక రూపొందించింది.