ప్రధాని మోదీ జోక్యం కోరిన ఉద్ధవ్ ఠాక్రే

తనను శాసనమండలికి నామినేట్ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్స్ విషయమై రాష్ట్ర గవర్నర్ తగు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తూ ఉండడంతో, జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా కోరారు. ఆయన ప్రధానికి ఫోన్ చేసి ఈ విషయమై అయన సహాయాన్ని అభ్యర్ధించారు. 

ఏ సభలోను సభ్యుడు కానీ ఉద్ధవ్ ఠాక్రే గత నవంబర్ 27న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 నిబందనల ప్రకారం చట్టసభలో సభ్యుడు కాకుండా ముఖ్య మంత్రి అయిన వ్యక్తి  ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావల్సి ఉంది. మే 27లోగా ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతె ముఖ్యమంత్రి పదవికి రాజీనాయా చేయాల్సి ఉంది. 

కరోనా కారణంగా శాసనమండలి ఎన్నికలు వాయిదా పడడంతో,  నామినేషన్ కోటా నుండి గల రెండు ఖాళీలతో ఒక్క దానిలో ఉద్ధవ్ ఠాక్రే ను నామినేట్ చేయాలని తొలుత రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 9న ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనపై గవర్నర్ స్పందించక పోవడంతో రెండో సారి కూడా మంత్రివర్గం ప్రతిపాదన చేసింది. 

ఇది వరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో మంత్రివర్గం గవర్నర్ ను కలిసి ఉద్ధవ్ ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేయాల్సిందిగా కోరారు. అయితే తన నిర్ణయాన్ని వారం తరువాత చెప్తానన్నారు గవర్నర్. దీంతో మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత ఏర్పడనుందని ఇందుకు ప్రధాని మోడీ కల్పించుకోవాలని ఉద్దవ్ కోరారు.