స్వదేశం తిరిగి వెళ్ళడానికి భయపడుతున్న అమెరికన్లు 

లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాలలో చిక్కుకు పోయినవారు అవకాశం దొరకగానే తమ దేశానికి వెళ్లాలని తొందరపడుతున్నారు. కానీ ఇతర దేశాలలో చిక్కుకున్న అమెరికా జాతీయులు మాత్రం స్వదేశం వెళ్ళడానికి భయపడుతున్నారు. అమెరికాలో కరోనా అల్లకల్లోలం చేయడమే అందుకు కారణం. 

అమెరికాలో రోజూ వేలాది మంది ఈ వైరస్ కు గురవుతున్నారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా పాజిటివ్ నమోదయింది. వారిలో 59 లక్షల మందికి పైగా మృతి చెందారు. ఈ ఈ ప‌రిస్థితుల‌ను చూసి భార‌త్ లాంటి దేశాల్లో క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన అమెరిక‌న్ స్వ‌దేశం వెళ్లేందుకు జంకుతున్నారు. 

భారత్ లో అనడమే సురక్షితం అని భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేస్తున్నా వెళ్ళడానికి జంకుతున్నారు. భార‌త్ లో ఉన్న అమెరిక‌న్స్ కొద్ది రోజుల క్రితం ఈ ప్ర‌త్యేక విమానాల్లో వెన‌క్కి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. 

అయితే త‌మ దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తుండ‌డంతో భార‌త్ లో చాలా వ‌ర‌కు నియంత్రణలో ఉన్నందున్న‌ ఇక్క‌డ ఉండ‌డ‌మే సేఫ్ అని భావిస్తున్నారు. తిరుగు ప్ర‌యాణానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ,  ముంబై,  హైదరాబాద్ స‌హా ప‌లు నగరాలలో ఉన్న అమెరిన్లు రెండు వారాల క్రితం వేలాది మంది స్పెష‌ల్ విమానాలలో  తిరుగు ప్ర‌యాణానికి  నమోదు చేసుకున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ఐయాన్ బ్రౌన్లీ చెప్పారు. 

అయితే కొద్ది రోజుల నుంచి తాము భారత్ లోనే ఉంటామ‌ని చాలా మంది కోరుతున్నరని ఆయన తెలిపారు. తాము వారిని ఇళ్ల‌కు చేరుస్తామ‌ని చెబుతున్నా.. చాలా మంది స్పందించ‌డం లేద‌న్నారు. ఇప్ప‌టికే అమెరికా వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డిన వాళ్లు కూడా తాము రావాల‌నుకోవ‌డం లేద‌ని చెబుతున్నార‌ని బ్రౌన్లీ పేర్కొన్నారు.