టెస్ట్ లు తగ్గించి కరోనా కేసులు తగ్గిస్తున్న కేసీఆర్ 

తెలంగాణలో కరోనా టెస్ట్ లు తగ్గించి ప్రభుత్వం కరోనా కేసులను తగ్గిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. లాంఛనంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ కేంద్రం ప్రతి రోజు 2వేల టెస్టులు చేసేందుకు అనుమతి ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్ లు చేయడం లేదని మండిపడ్డారు. 

కేంద్రం- ఇసిఎంఆర్ టెస్టులు పెంచమంటున్నాయి గాని ఎక్కడా టెస్టులు తగ్గించమని చెప్పలేదని స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నాయని చెబుతూ కరొనా రోగులకు సరైన వసతులు-సౌకర్యాలు లేకపోవడం వల్లే ధైర్యంగా ప్రజలు టెస్టుల కోసం ముందుకు రావడం లేదని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నడుపుతున్నారా? లేదా  వైద్య విద్య డైరెక్టరేట్ అధికారి నడుపుతున్నారా? అని ప్ర‌శ్నించారు. చనిపోయిన మృతదేహాలకు కరొనా టెస్టులు చేయొద్దని డిఎంఇ ఎలా ప్రకటిస్తారు? అని సంజయ్ నిలదీశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక కరొనా రోగి మృతి చెందితే.. ఆయన వివరాలు అధికారిక లెక్కల్లో వెల్లడించలేదని ఆరోపియన్చారు.  రంజాన్ కారణంగానే కేసులు తగ్గించి టెస్టులు చేయట్లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల కోసం కేసీఆర్ కేసులు తగ్గిస్తున్నారని అంటూ  ఒవైసీ ఒత్తిడిలకు  తలొగ్గి కేసులు తగ్గించారని సంజయ్ దుయ్యబట్టారు.  

ముఖ్యమంత్రి కి ధైర్యం ఉంటే పాతబస్తీలో సిటీలో ఎలా లాక్ డౌన్ అమలు అవుతుందో చూడాలని సవాల్ చేశారు. మర్కజ్ వల్ల దేశం అల్లకల్లోలం అయిందని, రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి చెంది-పాజిటివ్ కేసులు పెరిగితే కేసీఆర్ ప్రభుత్వమే బాధ్య‌త వహించాలని సంజయ్ స్పష్టం చేశారు.