వేయి దాటిన కరోనా మృతుల సంఖ్య 

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుటతూ మృతుల సంఖ్య నేడు వేయి దాటింది. గడిచిన 24 గంటల్లో 73 మరణాలు, 1,897 కొత్త కేసులు  నమోదయ్యాయి.  దేశవ్యాప్తంగా  కోవిడ్-19 కేసులు  సంఖ్య 31, 787 కు చేరింది. ఇప్పటివరకు  దేశంలో 1,008 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం భారత్ లో 22, 982   యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,797మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా బారిన పడి 400మంది చనిపోయారు. గుజరాత్, ఢిల్లీల్లో కరోనా కేసులు 3వేలు దాటాయి. 

తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లో కోవిడ్ కేసులు 2వేలు దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 9,318కి చేరింది. రాష్ట్రంలో 7,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 1,388 మంది కోవిడ్ తో కోలుకుని ఇళ్లకు చేేరుకున్నారు.

ఇలా ఉండగా, పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ నిర్ణయం తీసుకున్నారు.  ప్రజలు అవసరాల నిమిత్తం ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకే బయటకు రావాలని, ఈ సమయాల్లో దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.