రంజాన్ రోజులలో కరోనాకు కేసీఆర్ సెలవ్!

తెలంగాణలో అకస్మాత్తుగా  కరోనా పరీక్షలు తగ్గించడం, లాక్ డౌన్ నిబంధనల అమలు పట్టించుకొనక పోవడం వెనుక రంజాన్ మాసం ప్రారంభమే కారణమనే స్పష్టం అవుతున్నది. అధికార పక్షానికి మిత్రపక్షమైన పాతబస్తీ రాజకీయ పక్షం వత్తిడుల మేరకు కేసీఆర్ ప్రభుత్వం నిర్వేదంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. 

చివరకు రెడ్ జోన్ లలో కూడా లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోవడం లేదు. సాయంత్రం 4 గంటల అనునది రాత్రి 8 గంటల వరకు అనధికారికంగా షాపులు తెరుచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. 

ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రతి రోజూ రంజాన్ ప్రత్యేక ఆహార పదర్శలను సరఫరా చేస్తున్నారు.  చివరకు ముస్లిం దేశాలలో కూడా కేసీఆర్ ప్రభుత్వం వలే వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు. 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రార్ధన మందిరాలు అన్నింటిని మూసివేశారు. పండుగలు ఏవీ బహిరంగంగా జరుపుకోవడం లేదు.  అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కానీ తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 

చివరకు కరోనా రోగ లక్షణాలతో ఆసుపత్రులకు వెడుతున్నా వారికి ఏమీ లేదని అంటూ పరీక్షలు జరుపకుండానే పంపివేస్తున్నారు. రంజాన్ మాసంలో ఇక్కడ కరోనా మహమ్మారి లేదని చూపడం ద్వారా, లాక్ డౌన్ ను సడలించడం కోసమే ఈ విధంగా చేస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

కొంతమంది వ్యక్తులు తమకు కరోనా లక్షణాలున్నాయని, టెస్టులు చేయాలని కింగ్ కోఠి ఆస్పత్రికి పెద్ద ఎత్తున వస్తున్నా వారి రోగి వయసు, ట్రావెల్ హిస్టరీ, ఎవరెవరితో సంబంధం ఉందని చూసి ఏమీ లేకపోవడంతో వారికి పరీక్షలు చేయకుండానే పంపిస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో కరోనా పరీక్షలను పలు రేట్లు పెంచుతూ ఉండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సగానికి పైగా తగ్గించడం విస్మయం కలిగిస్తున్నది. కేవలం కరోనా లక్షణాలు ముదిరిన వారికి మాత్రమే పరీక్షలు జరిపామని అనధికారికంగా ఆదేశాలు వెళ్లిన్నట్లు చెబుతున్నారు. 

వరంగల్ మండి బజార్ లో నాలుగైదు రోజుల క్రితం జరిగిన గొడవ తదనంతరం స్థానిక ఎమ్మెల్యే పోలీసు అధికారులు కొంతమేరకు వారి కోసం  కొంత సడలింపు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మండి బజార్ ప్రాంతం పూర్తిగా రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ ఇలాంటి ఈ సంఘటన జరుగుతుండడం భయాందోళనలకు గురి చేస్తుంది. 

ఇలా ఉండగా, హైదరాబాద్ లో పరిస్థితుల పరిశీలనకు  రెండు, మూడు రోజుల పర్యటనకు మాత్రమే వచ్చిన కేంద్ర బృందం ఐదోరోజు కూడా ఇక్కడే మకాం వేయడం, పలు ప్రదేశాలకు ఆకస్మిక పర్యటనలు జరపడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను నిర్ధారించుకొనే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

తొలుత మర్కజ్‌ సంబంధమున్న కేసులు మాత్రమే రాగా.. ఇప్పుడు ఉప్పల్‌, కాప్రా, రామాంతపూర్‌, మలక్‌పేట ప్రాంతాల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కొన్ని కేసుల్లో రోగులకు అసలు వైరస్‌ ఎలా సోకిందో తెలియని పరిస్థితి నెలకొన్నా పరిస్థితుల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనబడటం లేదు.