ఆర్ధిక కార్యక్రమాల పునరుద్దరణకు మోదీ వ్యూహం 

కరోనా (కోవిడ్ – 19) పై పోరాట విషయంలో ద్విముఖ వ్యూహం అమలు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తున్నట్లు ముఖ్యమంత్రులతో నాలుగోసారి ఆయన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు వెల్లడి చేస్తున్నాయి. 

ఒక వంక కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటూనే, మరోవంక గత నెలన్నర రోజులుగా స్తంభించిపోయింది ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

కరోనాను నిర్మూలిస్తూనే పౌరుల భద్రతకు అంకితమవుతూనే  ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రధాని వెల్లడించారు. కరోనా వ్యాపించిన రెడ్ జోన్లను ఆరెండ్ జోన్లుగా చివరికి గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.  గ్రీన్ జోన్లు ఆర్థిక కార్యకలాపాలు జరపడానికి ఉపయోగపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

అయితే అక్కడ కూడా మరో కొంతకాలం భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ లను కూడా ధరిస్తూ ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో  పలు జిల్లాలు గ్రీన్ జోన్లుగా ఉన్నాయని అయితే వాటిని ఆర్థిక అవసరాలకు ఉపయేగపడేలా ఎలా మలచవచ్చో తాము త్వరలో తెలుపుతామని ప్రధాని వెల్లడించారు. 

 ఏప్రిల్ మధ్యలో ప్రభుత్వ అంచనా ప్రకారం 20 రాష్ట్రాలలో 170 జిల్లాలు, ఐదు కేంద్ర ప్రాంత ప్రాంతాలు రెడ్ జోన్ లుగా గుర్తిచబడ్డాయి. 207 జిల్లాలు ఆరేంజ్ జోన్లు, 730 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. రెండ్ జోన్లు, ఆరెంజ్ జోన్లపై ప్రత్యేక దృష్టి ఉంచాలని వాటికోసం తాము ప్రత్యేక బృందాలను తయారు చేస్తున్నామని మోడీ చెప్పారు.

పలువురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కొనసాగించాలని కోరినా తుది నిర్ణయాన్ని ప్రధాన మంత్రికే వదిలిపెట్టినట్లు తెలిపారు. అంటువ్యాదుల సంఖ్య ఆదారంగా రాష్ట్రాలపై తాము వివక్ష చూపమని  ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారు. 

తక్కువ కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాన్ని గొప్పగా, ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాన్ని  తక్కువగా చూడనని భరోసా ఇచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి ఉన్నప్పటికీ సాధారణ, కాలానుగుణ వ్యాధుల నివారణకు ఆరోగ్య రంగాలను సిద్దం చేయాలని సీఎంలను ఈ సందర్భంగా దిశానిర్ధేశం చేశారు.