కొరియా కిట్ల అవినీతిపై దర్యాప్తు... కన్నా డిమాండ్ 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దక్షిణ కొరియా నుండి కిట్ల కొనుగులులో భారీ ఎత్తున అవినీతి జరిగిన్నట్లు ఆరోపిస్తూ వాటిపై దర్యాప్తు జరిపించాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు విషయమై ఫిర్యాదు చేస్తూ కరోనా పేరుతో రాపిడ్ కొనుగోలులో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టాన్ని కలిగించే విధంగా ఎపి ప్రభుత్వం వ్యవహరించిందని స్పష్టం చేశారు.

కరోనపై పోరుకు అవసరమైన పరీక్షా పరికరాలు, వస్తు సామగ్రి, పిపిఇఎస్, వెంటిలేటర్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరిందని కన్నా చెప్పారు. రాపిడ్ టెస్ట్ కిట్లను సరఫరా చేస్తున్న ఐసిఎంఆర్ కిట్లను సరఫరా చేయడానికి దక్షిణ కొరియా కంపెనీకి ఎస్డి బయోసెన్సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చిన్నట్లు తెలిపారు. 

అయితే ఎపి ప్రభుత్వం పారదర్శక విధానాన్ని విస్మరించి తక్షణ సేకరణ అనే సాకుతో కొంత ఆర్థిక ప్రయోజనం పొందటానికి మధ్యవర్తి ద్వారా కిట్ల కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెండు లక్షల కిట్ల కొనుగోలు కోసం నోడల్ ఏజెన్సీ ఏప్రిల్ 7న సాండోర్ మెడికేడ్స్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచ్చారని, ప్రతి కిట్‌కు రూ. 730, జీఎస్టీ ధర అదనంగా నిర్ణయించగా, ఏడు రోజుల్లో ఆర్డర్‌ను అమలు చేయాల్సి ఉందని ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తు చేశారు. 

ఛత్తీస్‌గడ్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రి టిఎస్‌సింగ్ డియో ట్విట్టర్‌లో ట్వీట్ చేసినప్పుడు ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా కంపెనీ నుండి జీఎస్టీ కలపకుండా రూ .337కే  కొనుగోలు    చేశారని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా చట్టవిరుద్ధమని కన్నా విమర్శించారు. మధ్య వర్తుల ద్వారా కొనుగోలు ఒప్పందం చేయడం‌ వల్ల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కన్నా ధ్వజమెత్తారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి, దక్షిణ కొరియా సంస్థకు మధ్యవర్తిగా ఉన్న సంస్థకు ఎపి ప్రభుత్వ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా డైరెక్టర్ అని,  విశ్వనాధ వెంకట సుబ్రమణ్యం ఆంజనేయ సి,  బుగ్గన హరిహరనాధ్ ఒక కంపెనీలో కో డైరెక్టర్లుగా ఉన్నారని కన్నా వివరించారు. 

ఉద్దేశపూర్వకంగా ఈ సంస్థ కు కొనుగోలు ఆర్డర్ ఇచ్చారని కన్నా ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చూపిన పక్షపాత వైఖరి అనేది స్పష్టమవుతుందని కన్నా దుయ్యబట్టారు. చత్తీస్‌గఢ్, ఎపి రెండు రాష్ట్రాల మధ్య ధర వ్యత్యాసాన్ని వివరించారు. 

అయితే సమాధానం చెనికి తాను ఒక ట్వీట్ చేశానని గుర్తు చేశారు. ప్పే బదులు వైసిపి ఎంపీ వి. విజయసాయిరెడ్డి, తనపై పరువు నష్టం కలిగేలా ఆరోపణలు చేశారని కన్నా విస్మయం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రూ 640 కు కొనుగోలు చేస్తున్నారని చెప్పారని తెలిపారు. 

ఈ నేపథ్యంలోనే, పారదర్శకతను నిరూపించమని ప్రభుత్వాన్ని కృతే ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదని కన్నా విస్మయం వ్యక్తం చేశారు. బిజెపి నాయకుల పై వ్యక్తిగత ఆరోపణల ద్వారా సమస్యను పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు.