మ్యూచువల్ ఫండ్స్ కు రూ. 50,000 కోట్లు !

ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్ స్కీం ను నిలిపివేయటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మరింత ఇబ్బందులు ఎదుర్కొకుండా ఆదుకునేందుకు సిద్ధమైంది. 

రూ. 50,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ప్యాకేజీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా ఎఫెక్ట్ మొదలైన నాటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు లిక్విడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

దీనికి తోడు కరోనా చాలా మంది ఇన్వెస్టర్లు మనీ విత్ డ్రా లు చేస్తున్నారు. దీంతో చాలా -కంపెనీలకు లిక్విడీ సమస్య మొదలైంది. కొత్తగా ఇన్వెస్టర్లు రావటం లేదు. చాలా కంపెనీ పలు స్కీం ను నిలిపివేయాలన్న ఆలోచనలో ఉన్నాయి. 

ఇది పౌడుపుపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో ఆర్బీఐ ప్రత్యేక  ప్యాకేజీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా మార్కెట్లో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరత్వం తెచ్చేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది.