ఏపీ రాజ్ భవన్ లో నలుగురికి కరోనా 

కరోనావైరస్ ఆంధ్రపదేశ్ లో రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఏపీలో మర్కజ్ లింకులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. 

తాజాగా విజయవాడలో ఆదివారం 30 కేసులు నమోదయ్యాయి. రాజ్ భవన్ సిబ్బందికి కూడా కరోనా సోకింది. అక్కడ పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

గవర్నర్ కు చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ గా పనిచేసే అధికారికి, గవర్నర్ వైద్య సహాయకుడికి, పని మనిషికి, హౌస్ కీపింగ్ చేసే వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దాంతో గవర్నర్ కి సైతం కరోనా పరీక్ష చేయాలని వైద్యులు నిర్ణయించారు.

ఆదివారం కృష్ణలంకలో ముగ్గురికి, మాచవరంలో ఇద్దరికి, రైల్వే ఆస్పత్రిలో ఇద్దరికి, మాచవరం పీఎస్ లో నలుగురికి, నున్నలో ఒకరికి, సైబర్ సెల్ కు చెందిన మహిళా ఎస్సైకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

కృష్ణ జిల్లా వ్యాప్తంగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్క విజయవాడలోనే 150 పైగా కేసులు నమోదు అయ్యాయి.   కృష్ణలంక కార్మికనగర్, కుమ్మరిపాలెం ప్రాంతాల్లే డేంజర్ స్పాట్స్‌గా అధికారులు గుర్తించారు.150 పైగా కేసులు నమోదు అయింది ఈ మూడు ప్రాంతాల్లోనే అని అధికారులు చెబుతున్నారు. ఏపీలో మొత్తంగా ఇప్పటివరకు 1097 కేసులు నమోదుకాగా 31 మంది చనిపోయారు.