జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు విముక్తి  

మొత్తంగా జూలై 25వ తేదీనాటికి కరోనా నుంచి భారత్‌కు విముక్తి లభిస్తుందని పరిశోధకులు అంచనావేశారు.  సింగపూర్‌ యూని వర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ (ఎస్‌యూటీడీ) పరిశోధకుల అంచనా ప్రకారం భారత్‌ మే 21 నాటికి గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించనుంది. మే 31 నాటికి కొత్త కేసుల నమోదు 99 శాతం తగ్గిపోనున్నాయి. 

ఇక ప్రపంచవ్యాప్తంగా మే 29 నాటికి కొత్త కేసుల నమోదు 97 శాతం తగ్గిపోతుందని పేర్కొన్నారు. జూన్‌ 16 నాటికి 99 శాతం, డిసెంబర్‌ 8నాటికి వంద శాతం కేసులు తగ్గిపోతాయని అంచనావేశారు.  

డిసెంబర్‌ 8 నాటికి కరోనా రక్కసి నుంచి ప్రపంచానికి విముక్తి లభిస్తుందని వారు చెప్తున్నారు. రోజువారీ కేసుల నమోదు, మరణాలు, కోలుకుంటున్నవారి సంఖ్య, వైరస్‌ వ్యాప్తి రేటు, లాక్‌డౌన్‌ ఆంక్షలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా దేశాల్లో ఎప్పుడు వైరస్‌ అంతమవుతుందన్నదానిపై వారు అంచనాలు రూపొందించారు. 

కొత్త కేసుల నమోదు 97 శాతం తగ్గిపోయినట్లయితే ఆ దేశం గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించినట్లుగా పేర్కొన్నారు.  కరోనా విలయతాండవం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే నెల 11 నాటికి కొత్త కేసుల నమోదు 97శాతం తగ్గిపోతుందని అంచనావేశారు. అదే నెల 23 నాటికి 99 శాతం, ఆగస్టు 26 నాటికి పూర్తిగా వైరస్‌ నుంచి విముక్తి లభిస్తుందని వివరించారు.