చైనా అవసరం లేని బల్క్ డ్రగ్స్ కై ప్యాకేజి 

ఔషధ ఉత్పత్తి పరిమాణం రీత్యా ప్రపంచంలోనే మూడవ అతి పెద్దదిగా ఉన్న భారతీయ ఔషధ పరిశ్రమ చైనా ముడిపదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతుండడాన్ని కోవిడ్19 పరిణామాలు బహిర్గతం చేశాయి. ముడిసరుకు సరఫరాలో జాప్యం, ధరల పెంపు కారణంగా భారతీయ ఫార్మా పరిశ్రమ ముడిపదార్థాల సరఫరాలో కొరతను ఎదుర్కొంటున్నది. 

దీనిని గుర్తించి ఔషద భద్రత, ప్రజారోగ్యానికి అత్యవసర మందులు అందుబాటు కీలకమని గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించేందుకు, తద్వారా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఒక ప్యాకేజీని ఆమోదించింది.

పరిశ్రమ వర్గాలు, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్)కు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), హైదరాబాద్‌కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో కలిసి సంయుక్తంగా క్రియాశీల ఔషద తయారీ పదార్థాలు (యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడీయెంట్స్), ఇంటర్మీడియేట్‌లను భారతీయ ఔషధ తయారీ పరిశ్రమ కోసం ఉత్తత్తి చేస్తాయి. దీనితో చైనా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది.

లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2007లో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఫార్మాసూటికల్‌ కంపెనీల డిస్కవరీ కెమిస్ట్రీ ప్రచారాన్ని వేగవంతం చేసే దార్శనికతతో దీనిని ఏర్పాటు చేశారు. ఇవాళ లక్సాయ్ సమీకృత ఫార్మా కంపెనీగా ఎదిగి, ఎపిఐ, ఫార్ములేషన్ల అభివృద్ధి, ఎపిఐఅ తయారీ రంగంలో పనిచేస్తోంది. 

లక్సాయ్‌కు తన సబ్సిడరీ థెరాపివా ద్వారా యుఎస్‌ఎఫ్‌డిఎ, జిఎంపి తయారీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో వాడుతున్న ఔషధాల సంశ్లేషణ కోసం ఐఐసిటి, లక్సాయ్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థలు ప్రధానంగా యుమిఫెనోవిర్, రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ)కీ ఇంటర్మీడియట్‌పై దృష్టి పెడతాయి.

మలేరియాపై పోరాటానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే అతి పెద్ద దేశాలలో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. గత కొద్ది రోజులలో అమెరికాతో సహా 50 దేశాలకు భారతదేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపింది. ఈ కొలాబరేషన్, చైనాపై నామమాత్రంగా ఆధారపడే రీతిలో కీలక ముడి పదార్ధాలను చౌకగా తయారు చేసే ప్రక్రియకు దోహద పడుతుంది. 

దీనికి తోడు గంతో ఎబోలో వైరస్ రోగులకు వాడిన రెమ్‌డెసీవిర్ కోవిడ్19పై పోరాటంలో, దాని సమర్థత, భద్రతపై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ సహకారం ఔషధ ఉత్పత్తుల వాణిజ్య తయారీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.

ఈ ఉత్పత్తులను వాణిజ్యపరంగా తయారు చేసే మొదటి కొన్నింటిలో లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ ఒకటి కానుంది. ఈ ఏపిఐల/ఇంటర్‌మీడియేట్‌ల తయారీని లక్సాయ్ సబ్సిడరీ అయిన థెరాపివా ప్రైవేట్ లిమిటెడ్‌కి గల యుఎస్‌ఎఫ్‌డిఎ, జిఎంపి ఆమోదించిన ప్లాంట్లలో చేపట్టడం జరుగుతుంది.