తమిళనాడులో దేవాలయ నిధులను సీఎం సహాయనిధికి 

ఆనంద్ టి ప్రసాద్ 

తమిళనాడు లోని కొన్ని దేవాలయాలను తమ మిగులు నిధులను కరోనా సహాయ కార్యక్రమాలలో ఉపయోగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధికి బదిలీ చేయమని ఆదేశిస్తూ హిందూ మత, చారిటబుల్ ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఉత్తరువులు జారీచేశారు. 

హిందూ మున్నని, విశ్వహిందూ పరిషద్ వంటి పలు హిందూ, సామజిక సంస్థలు ఈ ఉత్తరువును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. హిందూ దేవాలయాల నిధులను హిందూయేతర లేదా లౌకిక ప్రయోజనాలకోసం నిర్బంధంగా బదిలీ చేయమనడం తగదని స్పష్టం చేశాయి. 

కరోనా మహమ్మారి కారణంగా తమిళనాడులో అన్ని దేవాలయాలను ప్రజల దర్శనం కోసం మూసి వేశారు. దానితో దేవాలయాలపై ఉపాధి కోసం ఆధారపడిన దేవాలయాల పూజారులు, లక్షలాది మంది   ఇతరులు తీవ్ర  నష్టానికి గురవుతున్నారు. 

కాబట్టి, ప్రస్తుత ఉపద్రవ సమయంలో వారందరికీ బియ్యం, వంట వస్తువులు, అవసరమైన ఆరోగ్య సంరక్షణ కిట్ లను సరఫరా చేయవచ్చు. అయితే మిళనాడు ప్రభుత్వం అటువంటి చర్యలు ఏవీ తీసుకోవడం లేదు. 

అదే తమిళనాడు ప్రభుత్వం రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని 2,895 మసీదులకు 5,450 టన్నుల బియ్యం సరఫరా చేయాలని   నిర్ణయించింది.  ఈ బియ్యాన్ని మసీదులు నేరుగా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దనే పంపిణి చేస్తాయి. 

వక్ఫ్ బోర్డ్ లేదా మరే ఇతర మైనారిటీ మత సంస్థల నిధులను ప్రభుత్వ సహాయ నిధికి బదిలీ చేయమని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగలదా అని విశ్వహిందూ పరిషద్ ఉత్తర తమిళనాడు శాఖ ప్రశ్నించింది. 

ఏప్రిల్ 22న తమిళనాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువుల ప్రకారం పలని, తిరువన్నూర్ లోని మురుగన్ దేవాలయాలు, మధురై లోని మీనాక్షి అమ్మవారి దేవాలయంలతో సహా పలు ప్రముఖ   దేవాలయాల కార్యనిర్వహణాధికారులు, జాయింట్ కమిషనర్లను రూ 10 కోట్ల నిధులను తమిళనాడు ముఖ్యమంత్రి సాధారణ సహాయ నిధికి బదిలీ చేయమని ఆదేశించింది. 

తమిళనాడు ప్రభుత్వ ఈ ఉత్తరువు పట్ల రాష్ట్రంలోని చాలామంది హిందువులు ట్విట్టర్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల త్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉత్తరువును ఉపసంహరించుకోమని కోరుతున్నారు. 

మీడియాన్ వెబ్ సైట్ నుండి