హైదరాబాద్ లో భోజనం కోసం కాల్‌ 040- 21111111

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకొంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. 

జీహెచ్‌ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2 లక్షల మందికి రెండు పూటలా భోజనం అందిస్తున్నామని చెప్పారు. 

పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తో కలిసి అన్నపూర్ణ క్యాంటీన్లను సీఎస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరో 50 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

ఈ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భోజనం అందించేలా వేళలు కూడా మార్చామని పేర్కొన్నారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని, జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా అహారాన్ని కోరవచ్చని చెప్పారు.