దేశంలో 9 కరోనా రహిత రాష్ట్రాలు 

దేశం నుంచి కరోనా వైరస్‌ను పారద్రోలడానికి ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. ఇప్పటిక వరకు దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది. అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, నాగాలాండ్‌, సిక్కిం, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీ, లక్ష్యదీప్‌, త్రిపురను కరోనా రహిత రాష్ట్రాలుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. 

ఈ రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా అనుమానితులు నెగెటివ్‌లుగా తేలారు. దీంతో ఇవన్నీ కరోనా రహిత ప్రాంతాలు గుర్తింపు పొందాయి. దేశంలో తొలి రెండు కరోనా రహిత రాష్ట్రాలుగా గోవా, మణిపూర్‌ నిలిచాయి. 

దేశంలో ఇప్పటివరకు 5,25,667 మంది నుంచి 5,41,789 నమూనాలు సేకరించగా, 23,502 నమూనాలు పాజిటివ్‌లుగా తేలారు. దేశంలో మొత్తం 23,077 కేసులు నమోదయ్యాయి. 4748 మంది డిశ్చార్జ్‌ కాగా, 718 మంది మరణించారు. గత 24 గంటల్లో 1684 కేసులు నమోదవగా, 37 మంది మరణించారు.