కర్నూల్ కరోనా హాట్ బెడ్ కావడం వెనుక స్థానిక ఎమ్యెల్యే!

కర్నూల్ జిల్లాలో రాష్ట్రంలో కెల్లా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండడం, పరిస్థితులు అదుపుతప్పిన్నట్లు కనిపించడం వెనుక అధికార పక్షానికి చెందిన స్థానిక ఎమ్యెల్యే రాజకీయ వత్తిడులే కారణమనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కు చేరుకోగా, కర్నూల్ జిల్లాలోనే 261 ఉన్నాయి. రాజకీయ వత్తిడుల కారణంగా మొదటి నుండి జిల్లా యంత్రాంగం వైరస్ కట్టడికి పటిష్టంగా చర్యలు తీసుకోలేక పోతున్నది. 

తమ పార్టీ ఎమ్యెల్యే వత్తిడులు కారణం అవుతూ ఉండడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం నిస్సహాయంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం కర్నూల్ పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటింప వలసి వచ్చినా ఏమీ చేయలేక పోతున్నారు. 

ప్రభుత్వ `నేరమయ నిర్లక్ష్యమే' కుర్నూల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తక్షణం ఉన్నతస్థాయి విచారణ జరపాలని లీగల్ రైట్స్ ఆబ్సెర్వేటరీ ఒక లేఖలో కోరింది. 

అధికార యంత్రాంగంపై కర్నూల్ ఎమ్యెల్యే హఫీజ్ ఖాన్ రాజకీయ వత్తిడులే ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పడానికి కారణం అంటూ ఈ సంస్థ   మీడియా   కథనాలను  ఉటంకించింది. 

ఢిల్లీలో తబ్లీఘి జమాత్ మర్కజ్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేయకుండా ఈ ఎమ్యెల్యే అడ్డుపడుతున్నట్లు కూడా మీడియా కధనాలు వచ్చాయి. పైగా స్వీయ నిర్బంధ కేంద్రాలకు వెళ్లి, వారితో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. 

మీడియా కధనాల ప్రకారం జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు ఛాతి నొప్పిగా చికిత్స అందించిన వ్యక్తిది కావడం గమనార్హం. దానితో అతనికి చికిత్స అందించిన మొత్తం ఆరోగ్య కార్యకర్తలు భయానికి గురయ్యారు . 

ఇలా ఉండగా, ఒక ప్రార్ధన స్థలంలో పెద్ద సంఖ్యలో అపరిచుతులు గుమికూడడంతో స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అయితే మరుసటి రోజుకంతా వారందరిని ఖాళీ చేయించి, అక్కడ అపరిచితులు గుర్మికుడినట్లు కధనాలు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వేధించారు. వాస్తవాలు చెప్పిన వారిపై జిల్లా యంత్రంగం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది. 

కర్నూల్ లో వైరస్ వ్యాప్తికి మూల కారణంగా భావిస్తున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాక్ డౌన్ సమయంలో కూడా యధేచ్చగా పనిచేయడం, రోజూ పెద్ద సంఖ్యలో రోగులకు చికిత్స చేస్తుండడం గురించిన మీడియా కధనాలు సంచలనం కలిగించాయి. ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేసిన డా. ఇస్మాయిల్ హుస్సేన్ ఏప్రిల్ 14న మృతి చెందాడు. 

మీడియా కధనాల ప్రకారం అతని కుటుంబానికిచెందిన ఆరుగురికు కూడా కరోనా పాజిటివ్ అని గుర్తించారు. వారందరిని స్వీయ నిర్బంధానికి పంపారు.  ఏప్రిల్ 16న జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో ఆ ఆసుపత్రిని మార్చ్ 20 నుండి ఏప్రిల్ 16 వరకు సందర్శించిన వారందరిని వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోమని కోరింది. 

ఈ ఆసుపత్రికి సందర్శించిన పొరుగున ఉన్న తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో కూడా చాలామంది కరోనా వైరస్ కు గురి కావడం గమనార్హం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఎందుకని లాక్ డౌన్ లో సహితం పనిచేయనిచ్చి, కరోనా వ్యాప్తికి దోహదపడ్డారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ వత్తిడులే కారణం అని స్పష్టం అవుతుంది.