పాల్‌ఘర్‌ మూకదాడిని ఖండించిన శృంగేరి మఠం

పాల్‌ఘర్‌లో సాధువులపై జరిగిన మూకదాడిని శృంగేరి మఠం ఖండించింది. ఈ నెల 16న ముంబయికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే కారులో గుజరాత్‌లోని సూరత్‌కు పయనమయ్యారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలోని ఒక గ్రామం వద్ద స్థానికులు వీరిని దొంగలుగా భావించి కొట్టి చంపారు. 

ఈ ముగ్గురిలో ఇద్దరు సాధువులు ఉన్నారు. సాధుశ్రీ కల్పవృక్ష గిరిజీ, సాధుశ్రీ సుశీల్‌ గిరిజీలు ఘోరమైన హత్యకు గురయ్యారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దేవత శారదాంబను ప్రార్థిస్తున్నట్లు శృంగేరి మఠం తెలిపింది. 

అదే కరోనా విధంగా ప్రస్తుత  విపత్కర పరిస్థితుల్లో ప్రజలు శాంతి సామరస్యాలు పాటించాల్సిందిగా సూచించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయంది. 

ఈ కఠిన పరీక్షా కాలంలో దేశ పౌరులు శాంతి సామరస్యాలతో ఉండాలంది. కాగా మూకదాడి ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు 110 మంది అనుమానితులను అరెస్టు చేశారు.