కరోనా కడ్డడిలో మొదట్లో మోదీ, చివర్లో ట్రంప్ 

భారత్ లో  కరోనా వైర‌స్‌ నియంత్రణ చర్యలను చేపట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల అధినేతలకంటే ముందు వరులలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరిలో ఉన్నారు. 

క‌రోనా క‌ట్ట‌డిలో ఏ దేశ ప్ర‌ధానులు, అధ్య‌క్షులు బాగా ప‌నిచేస్తున్నార‌నే అంశంపై `మార్నింగ్ క‌న్స‌ల్ట్` నిర్వ‌హించిన స‌ర్వేను వీడీపీ అసోసియేట్స్ ప్ర‌క‌టించింది. ఈ సర్వే  ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.  

మెక్సికో  అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ 35, ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్  26 పాయింట్లతో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇంకా  ఈ జాబితాలో ట్రుడావ్ కు 21, మెర్కెల్ 16, బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, మార్కాన్ మైనస్ 21, షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు. అటు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ 3 పాయింట్లతో చివ‌ర‌న నిలిచారు.