ఉద్ధవ్ నామినేషన్ కు బిజెపి లైన్ క్లియర్ 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను నామినేషన్  కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమించేందుకు తమకు అభ్యంతరం లేడనై బిజెపి ఈ రోజు స్పష్టం చేసింది. ఈ విషయమై గవర్నర్ సత్వర నిర్ణయం తీసుకోకుండా బిజెపి అడ్డుపడుతున్నట్లు శివసేన నాయకులు ప్రకటనలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ఈ  విషయంపై తాము ఎంత మాత్రమూ వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్రశాఖ స్పష్టం చేసింది. అయితే గత శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బాగుండేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. . . దేశవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నడుమ గవర్నర్ కోషియారిపై ఈ వీసీహాయమై ఒత్తిడి తేవడం ఏమాత్రం మంచిది కాదని హితవు చెప్పారు

‘‘గవర్నర్ కోటా నుంచి ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంపై మాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయినా, ఏదైనా చట్టసభ నుంచి ఎన్నిక కావడానికి మే 27 వరకూ సీఎంకు అవకాశముంది. అప్పటి వరకూ వేచి ఉండవచ్చు’’ అని పాటిల్ తెలిపారు. ఈ మొత్తం విషయాన్ని మహా ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందని చంద్రకాంత్ పాటిల్ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా ప్రకటనలు జారీచేశారు. ఈ విషయంలో రాజ్‌భవన్ సరిగ్గా వ్యవహరించడంలేదని, గవర్నర్ కోషియారీకి బీజేపీతో సంబంధముందన్నది బహిరంగమేనని అంటూ  రౌత్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.