భూత‌ల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుదాం

ప‌్ర‌పంచ ధ‌రిత్రీ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రం భూత‌ల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుదామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. అపార‌మైన ప్రేమ‌తో స‌మ‌స్త జీవ‌కోటిని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న‌ భూమాత‌కు మ‌నం ఎంతో రుణ‌ప‌డి ఉన్నామ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 

మ‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న భూత‌ల్లిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నందరిపై ఉంద‌న్న ప్ర‌ధాని.. భూగ్ర‌హాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, అంత్యంత శ్రేయ‌స్క‌రంగా ఉండేలా చూసుకుంటామ‌ని ప్ర‌తి ఒక్క‌రం ప్ర‌తిజ్ఞ చేద్దామ‌ని సూచించారు.  

ప్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారిని ఈ భూమి మీది నుంచి త‌రిమికొట్ట‌డం కోసం అంద‌రం క‌లి‌సిక‌ట్టుగా పోరాడుదామ‌ని ప్రధాని పిలుపిచ్చారు.