ఇక ప్రతి ఉద్యోగికి ఆరోగ్య భీమా తప్పనిసరి 

లాక్‌‌డౌన్‌‌ తర్వాత ప్రతి కంపెనీ లేదా ఎంప్లాయర్‌‌‌‌ తమ ఉద్యోగులకు ఆరోగ్య భీమాను కచ్చితంగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఇది తప్పనిసరి కాకపోవడంతో కొద్దిమాని మాత్రమే తమ ఉద్యోగులకు ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తున్నారు. 

సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్‌‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీలను అందిస్తుంటాయి. ఈ పాలసీలు ఉద్యోగుల,  వారి కుటుంబ సభ్యుల హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్‌‌‌‌ చేస్తాయి. కంపెనీల కోసం  తగిన ఇండివిడ్యువల్‌‌ లేదా గ్రూప్‌‌ పాలసీలను ఆఫర్‌‌‌‌ చేయాలని ఇన్సూరెన్స్‌‌ కంపెనీలను ఇన్సూరెన్స్‌‌ రెగ్యులేటరీ ఐఆర్‌‌‌‌డీఏఐ కోరింది. 

ఈ పాలసీలను ఆర్గనైజేషన్లు భరించే ధరలలోనే అందించాలని  సలహా యిచ్చింది. ఎంప్లాయి స్టేట్‌‌ ఇన్సూరెన్స్‌‌(ఈఎస్‌‌ఐ) బెనిఫిట్స్‌‌ను పొందుతున్న ఉద్యోగులకు కూడా కొత్తగా కవర్‌‌‌‌ చేయనున్న ఆరోగ్య  పాలసీలు అందుబాటులో ఉంటాయని తెలుస్తున్నది. 

ఈఎస్‌‌ఐ యాక్ట్‌‌ 1948 ప్రకారం రూ. 21,000 కంటే తక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగులకు ఈఎస్‌‌ఐని ప్రొవైడ్ చేయడం తప్పనిసరి.  ఎంప్లాయర్‌‌‌‌, ఉద్యోగి ఇద్దరూ ఈఎస్‌‌ఐ కార్పొరేషన్‌‌కు  కంట్రిబ్యూట్‌‌ చేస్తారు.

ఈఎస్‌‌ఐకి కిందకు రాని ఉద్యోగుల కోసం గ్రూప్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీలను కంపెనీలు తీసుకుంటాయి. కానీ తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంప్లాయర్‌‌‌‌ తమ ఉద్యోగులందరికి ఆరోగ్య భీమా సదుపాయం కల్పించాలి.