మహాభారతంతో గుహలో ముంబై టెకీ

ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వీరేంద్ర సింగ్‌ డోగ్రా లాక్‌డౌన్‌ మొదలు నుంచి మధ్యప్రదేశ్ లోని ఓ గుహలో ఉంటున్నారు.  కనిపెట్టిన పసుఖపర్లు సమీపంలోని పోలీసులకు సమాచారమా ఇవ్వడంతో, వారొచ్చి అతన్ని బంధువుల వద్దకు చేర్చారు. 

వీరేంద్ర సింగ్‌ డోగ్రా అమర్‌ కంటక్‌ నుంచి గుజరాత్‌ వరకూ నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో (దేశంలోనే ప్రసిద్ధమైన ‘నర్మదా పరిక్రమణ’) పర్యటన చేస్తూ చేస్తూ మధ్యప్రదేశ్ చేరుకున్నారు. 

అనుకోకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అతను ఎటూ వెళ్లలేకపోయాడు ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ లోని రైసెన్‌ జిల్లాలోని ఒక గుహలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మార్చి 24 నుంచి అతను ఆ గుహలోనే ఉన్నాడు.

గత ఆదివారం పశువుల కాపర్లు ఆ దారిలో వెళ్తుండగా… ఆ యువకుడ్ని చూసి… వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు ఆయన్ని ప్రశ్నించగా తాను ముంబైకి చెందినవాడినని చెప్పి, హైదరాబాదులో ఉంటున్న తన సోదరికి పోలీసులతో ఫోన్ చేయించాడు. 

ఆ తర్వాత అతనిని సమీపంలోని కందర్వి గ్రామంలోని బంధువు ఇంటికి తరలించారు. అతని వద్ద మహాభారతం పుస్తకంతోపాటు కొన్నిబట్టలు మాత్రమే ఉన్నాయని, ఆ పుస్తకాన్ని చదువుకొంటు గడిపారని పోలీసులు తెలిపారు