కరోనా నుండి రెండు రాష్ట్రాలు విముక్తి 

వైద్య సిబ్బందితో పాటు ప్రజల సహకారం వల్లే ఇది సాధించగలిగామని ట్విటర్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం కూడా మరో కారణమని బీరేందర్ సింగ్ తెలిపారు.  

రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులేవీ నమోదు కాలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. వైద్య సిబ్బందితో పాటు ప్రజల సహకారం వల్లే ఇది సాధించగలిగామని ట్విటర్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం కూడా మరో కారణమని బీరేందర్ సింగ్ తెలిపారు.   

మరోవంక, తమ రాష్ట్రం కూడా కరోనా నుంచి విముక్తి పొందిందని గోవా ప్రకటించుకుంది. తమ రాష్ట్రంలో కరోనా సోకిన ఏడుగురు పేషంట్లూ కోలుకున్నారని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఏప్రిల్ 3 తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. 

వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. మే మూడు వరకూ లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.