రెండు గంటల్లో ఆరోగ్య భీమా పరిష్కారం 

బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నగదు రహిత చికిత్స పొందుతున్న వారు డిశ్చార్జి అయిన రెండు గంటలలోపే తమ క్లెయింలను సెటిల్‌ చేయాలని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను తాజాగా ఆదేశించింది. 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో క్లెయింలు సరైన సమయంలో కాకపోవడంతో ఆసుపత్రుల వద్ద రోగులు పడిగాపులు పడాల్సి వస్తున్న ది. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌డీఏఐ తాజా నోటిఫికేషన్‌ను జారీచేసింది. 

నగదు రహిత ఆరోగ్య సేవలు పొందుతున్నవారు ముందుగానే ఆసుపత్రికి తెలియచేయాలని, వారు  అడిగిన బిల్లు, తదితరాలను బీమా సంస్థలకు అందచేయాలని సూచించింది. 

ఆ తర్వాత డిశ్చార్జి అయిన రెండు గంటల్లో నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌కు అన్ని రకాల పత్రాలను ఆసుపత్రి  అందచేయాలని పేర్కొంది.