వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ 

చైనాలోని వూహాన్ ప్రయోగశాల నుంచే కరోనావైరస్ తయారు చేశారని నోబెల్ బహుమతి  గ్రహీత లూక్ మోంటాగ్నియర్ ఆరోపించారు. చైనా చెబుతున్నట్లు కరోనావైరస్ అడవి జంతువుల నుంచి వూహాన్ మార్కెట్‌కు వెళ్లిందని తాను నమ్మడం లేదని ఒక ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. 

వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు వచ్చిందని మోంటాగ్నియర్ పేర్కొంటూ వూహన్‌లోని ప్రయోగశాల 2000 సంవత్సరం నుంచి కరోనావైరస్‌లు తయారు చెయ్యడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు ఆయ‌న తెలిపారు. తన సహోద్యోగి, గణిత శాస్త్రజ్ఞుడు జీన్-క్లాడ్ పెరెజ్‌తో కలిసి, అతను కొత్త రకం కరోనావైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించినట్లు వెల్లడించారు. 

మానవ రోగనిరోధక శక్తికి సంబంధించిన వైరస్ భాగాన్ని ఈ జన్యువులో చేర్చారని ఆయన పేర్కొన్నారు. 2008లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్న మోంటాగ్నియర్. చైనాలోని వుహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్‌కి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టిందని నిర్ధారణకు వచ్చారు. 

మోంటాగ్నియర్‌కి ఎయిడ్స్ వైరస్ ఎలా ఉంటుందో అందులో ఉండే జన్యువులు ఏంటో పూర్తిగా తెలుసు. కరోనా వైరస్ జన్యువుల్లో ఎయిడ్స్ (హ్యూమన్ ఇమ్యునో వైరస్ - హెచ్ఐవి) మూలకాలు, మలేరియా జెర్మ్ ఉన్నట్లు చెప్పారు. అందువల్లే ఈ వైరస్ సహజంగా పుట్టినట్లు తనకు అనిపించట్లేదని స్పష్టం చేశారు.