అన్నం కోసం గిరిజనులపై మావోయిస్టుల దాడులు 

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికి తమ హింసాయుత కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మావోయిస్టులు లాక్ డౌన్ కారణంగా అన్నంకోసం అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి.  అటవీ ప్రాంతాలలో తిరుగుతున్న మావోయిస్టు దళాలకు ఎప్పుడు రేషన్ అందించే సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో వాటికోసం పలుచోట్ల గిరిజనులపై దౌర్జన్యాలకు దిగవలసి వస్తున్నది. 

బియ్యం, పప్పు, ఉప్పు కోసం బస్తర్ డివిజన్ లోని గ్రామస్తుల నుండి  రేషన్ ను బలవంతంగా తీసుకెళ్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ మావోయిస్టులకు సురక్షితమైన అడ్డా. దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా, కంకేర్ ఈ ఏడు జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉంటారు.

 వీరికి రేషన్ సరఫరా  కోసం కొంతమంది కొరియర్స్ ద్వారా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంటారు. లాక్ డౌన్ కారణంగా గ్రామాల్లో షాప్ లన్నీ మూసేస్తున్నారు. సమీపంలోని పట్టణాల్లోకి వెళ్తితే పోలీసులకు పట్టుబడుతామని కొరియర్స్ వెళ్లటం లేదు. దీంతో మావోయిస్టులు గ్రామస్తులను, గిరిజనులను బెదిరించి తమ తిండి గుంజుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. 

ప్రజలపై, ముఖ్యంగా గిరిజనులపై మావోయిస్టులకు గల అసహనాధోరణులు ఈ సందర్భంగా వెల్లడి అవుతున్నాయి. మారుమూల గ్రామాలలో  గ్రామస్తులను బెదిరించి రేషన్ లాక్కుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు.  

మావోయిస్టుల దౌర్జన్యాలా నుండి గిరిజనులకు బెడతా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. సాధారణంగా మార్చి నుంచి మే వరకు కావాల్సిన రేషన్ ను మావోయిస్టులు ముందే తెచ్చుకుంటారని కానీ ఈ సారి వారికి రేషన్ కొరత ఉందని పోలీసులుగుర్తించారు. 

అవసరమైన రేషన్ అందుబాటులో లేకపోవడంతో మావోయిస్టులు తమ హింసాయుత దాడుల వ్యూహాలను సమర్ధవంతంగా అమలు జారలేక పోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.