జ్వరం, దగ్గు మందులు కొంటె నిఘా! 

తెలంగాణలో ఇక ఎవరైనా జ్వరం, దగ్గుతో పాటు ఇతర లక్షణాలకు మందులు కొనుగోలు చేస్తే వారు ప్రభుత్వ నిఘా పరిధిలోకి వస్తారు. అటువంటి వారి ఫోన్ నెంబర్, చిరునామా తప్ప క తీసుకోవాలని మున్సిపల్ శా ఖ ఆదేశించింది. 

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లకు, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్లకు, డిప్యూటి కమిషనర్లకు, మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సర్యులర్ మెమో జారీ చేశారు. 

మెడికల్ షాప్‌లు, వారి అసోసియేషన్లు, ఫార్మాసిస్ట్ అసోయేషలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కరోనా లక్షణాలతో ఉండి దానికి మందులు తీసుకునేందుకు వస్తున్న వారి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు ఖచ్చితంగా తీసుకోవాలని ఆదేశించాలని సూచించారు. 

దగ్గు, జ్వరం ఇతరత్రా వంటి కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు. అయితే కొందరు ఇటువంటి వాటికి నేరుగా మెడికల్ షాప్‌లకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నారని సర్కులర్‌లో పేర్కొన్నారు. అయితే ఇటువంటి వ్యక్తులను సంప్రదించడం అత్యవసరం కాగలదు. వారి లక్షణాలను బట్టి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. 

ఈ జాబితాను మెడికల్ షాప్‌లు సంబంధిత అధికారులకు అప్పగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక డైరెక్టరీని నిర్వహించాలని తెలిపారు. మందులు కొనుగోలు చేసేవారికి ఎందుకోసం వివరాలు తీసుకుంటున్నామో సవివరంగా చెప్పాలని పేర్కొన్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగతామని భావిస్తున్నారు.