త‌బ్లీగీ జ‌మాత్ సమావేశంలో రోహింగ్యాలు   

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను వ్యాపింప చేయడంలో కీలకమైన భూమిక వహించినట్లు వెల్లడి అవుతున్న గత నెల మధ్యలో ఢిల్లీలో జరిగిన త‌బ్లీగీ జ‌మాత్ సమావేశంలో రోహింగ్యాలు సహితం భారీ సంఖ్యలో పాల్తొన్నట్లు వెల్లడవుతున్నది. 

దేశంలో వివిధ ప్రాంతాలలో అధికారికంగా, అనధికారికంగా శరణార్థులుగా ఉంటున్న రోహ్యంగీయులు కేవలం నిజాముద్దీన్ లోనే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఇటువంటి సమావేశాలలో కూడా పాల్గొన్నట్లు కేంద్ర హోమ్ శాఖ గుర్తించింది. 

 హైదరాబాద్ లో గల రోహింగ్యా క్యాంప్ నుంచి పలువురు హరియాణా మేవాత్‌లో జరిగిన జమాత్‌కు హాజరైనట్టు నిఘా విభాగం గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్ కార్యాకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిసింది. పంజాబ్, జమ్మూ తదితర ప్రాంతాలలో జరిగిన జమాత్ సదస్సులలో కూడా వీరు పాల్గొన్నట్లు వెల్లడైనది.

అయితే జమాత్ లకు వెళ్లిన రోహింగ్యాలు ఎవ్వరు తి26కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా రోహింగ్యా క్యాంపులున్న చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంద‌ని గుర్తించారు. దానితో రోహింగ్యా ముస్లింల కదలికలు, వారి వివరాలు సేకరించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 

రోహింగ్యాలు అందరినీ స్క్రీనింగ్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.