రైతులకు కిషన్ రెడ్డి భరోసా .... ప్రత్యేక హెల్ప్ లైన్ 

వ్యవసాయానికి కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పటు చేసిందని…ఏలాంటి సమస్యలు ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేయవచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతూ  అన్ని రాష్ట్రాలు రైతుల సంబంధించిన అన్ని వాహనాలు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. 

మార్కజ్ తర్వాతనే కేసులు ఎక్కువగా అయ్యాయ‌ని చెబుతూ ఇప్పటికీ కేసులు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అందరి సమస్య అని, ఎలాంటి మత విభేదాలు లేవని చెప్పారు. 

ఏప్రిల్ ఇరవై నుంచి ఈ కామర్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ సోకడంతో ఆయన డెలివరీ చేసిన 72 కుటుంబాలను స్వీయ నియంత్రణలోకి పంపామని తెలిపారు. డెలివరీ బోయ్స్ కి ఆన్లైన్ అమ్మకదారులు కొన్ని నిబంధనలు చెప్పామని చెప్పారు. 

డెలివరీ చేసే సమయంలో దూరం నుంచి ఇవ్వాలని..ఇచ్చే వస్తువును సానిటీజషన్ చేయాలని చెప్పారు. మే మూడు తర్వాత కరోనా తగ్గే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.  కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంద‌ని చెబుతూ  అన్ని రాష్ట్రాలకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. 

స్వీయ నియంత్రణ వల్లనే కరోనా కట్టడి సాధ్యమ‌ని, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా నియంత్రణలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తే బాగుంటదని ఎద్దేవా చేశారు. రాహుల్ మాటలు అర్ధ‌ము లేనివని దుయ్యబట్టారు. 

కరోనా కట్టడి అన్ని దేశాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయని చెబుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వసతి, తిండి, బట్ట లేని వాళ్లకోసం  కేంద్రం ఫండ్ రిలీజ్ చేసిందని చెప్పారు.