80 శాతం రోగులు కోలుకొంటున్నారు 

కరోనా వైరస్ సోకినా వారిలో  80 శాతం రోగులు కోలుకుంటుండండగా, 20 శాతం మరణాలు మాత్రమే చేటుచేసుకుంటున్నాయని  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

 ప్రతి ఆరు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయని పేర్కొంటూ అయితే కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉందని చెప్పారు. 24 శాంపిల్స్‌లో ఒక పాజిటివ్ కేసు వస్తోందని పేర్కొన్నారు. 

ప్రస్తుతం వాక్సిన్ ను అభివృద్ధి చేయడంపైననే  ఆరోగ్య శాఖ పూర్తి దృష్టి సారించినట్టు లవ్ అగర్వార్ తెలిపారు. అలాగే, మే నాటికి 10 లక్షల ఆర్‌టీపీసీఆర్ కిట్లు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలకు 5 లక్షల రాపిడ్ యాంటీ బాడీ టెస్టి కిట్లు పంపినట్టు ఆయన తెలిపారు. 

భారత్ లో గత  24 గంటల్లో 1076 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 452కు చేరుకోగా, 1766 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. అంటే 13 శాతం మందికి పైగా కోలుకున్నారు. 

కరోనా రోగుల కోసం దేశవ్యాప్తంగా 1,919 ఆసుపత్రులు ఉండగా, 1,73,000 పైగా ఐసొలేషన్ బెడ్లు, ఐసీయూలో 21,000 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.