మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్ల నుంచే కరోనా వ్యాప్తి 

గురువారం మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 700కు పెరిగింది. కొత్త సేకులలో 90 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి కావడం కారణం. మర్కజ్ వెళ్లొచ్చిన వారు సంహకరించక పోవడమే అందుకు  ప్రధాన కారణమని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వారి నుంచి వారి కుటుంబాలకు, దగ్గరివాళ్లకు కరోనా వ్యాపిస్తున్నదని చెప్పారు. 

హైదరాబాద్ పాతబస్తీలోని తలాబ్ కట్ట ప్రాంతంలో ఒకే కుటుంబంలో 20 మందికి వైరస్ వచ్చిందని, మరో ఆరుగురు 81మందికి వైరస్ అంటించారని మంత్రి వెల్లడించారు. ఇప్పటికి కొంతమంది సహకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. 

కరీంనగర్‌లో మర్కజ్ వెళ్లొచ్చిన ఆరుగురి ద్వారా 81 మందికి కరోనా సోకిందని, అక్కడ 10మంది ఇండోనేషియా పౌరులు వచ్చి ఇంటింటికీ తిరిగారని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్, యంత్రాంగం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టి మరిన్ని కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అదే విధంగా ఎక్కువ కేసులు నమోదైన హైదరాబాద్‌లో కూడా కరీంనగర్ తరహా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

అయితే హైదరాబాద్ విషయంలో అక్కడక్కడా ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి.. వారిని కలిసిన వారు పరీక్షలు చేయించుకునేందుకు ఇప్పటికీ ముందుకు రావడం లేదని, మర్కజ్ వెళ్లిన వాళ్లు కూడా ఇంకా ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు. అన్నీ తెలిసి కూడా టెస్టులు చేయించుకోకుండా తప్పించుకుంటున్నారని చెప్పారు. 

అలాంటి వాళ్లను పోలీస్, ఆరోగ్య  సిబ్బంది గుర్తించి టెస్టులకు పంపిస్తున్నారని తెలిపారు. కాగా, మలక్‌ పేట నుంచి గుజరాత్‌కు వెళ్లొచ్చిన ఇద్దరికి వైరస్ పాజిటివ్ వచ్చిందని, అక్కడక్కడా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని వివరించారు. కాగా, రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు, పది లక్షల ఎన్‌95 మాస్కులు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు.