రాహుల్ కు బి ఎల్ సంతోష్ కౌంటర్ 

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి లాక్‌డౌనే పరిష్కారం కాదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ సంఘటనా కార్యదర్శి బి.ఎల్. సంతోశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 

‘‘లాక్‌డౌన్ పరిష్కారం కాదని రాహుల్ గాంధీ అన్నారు. అదే గనుక నిజమైతే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు తమ  రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎందుకు పొడగించారు?’’ అని సంతోశ్ ట్విట్టర్ వేదికగా గురువారం రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 

కరోనాను ఎదుర్కోడానికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, రాండమ్ పరీక్షలు వ్యూహాత్మకంగా నిర్వహించడమే పరిష్కారమని తొలుత మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని, వెంటనే ఆ సంఖ్యను పెంచాలని రాహుల్ గాంధీ సూచించారు.