ట్రంప్ సలహాదారులుగా తెలుగు ప్రముఖులు 

అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు ఏం చేయాలనేదానిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల  అధ్యక్షుడుకు డోనాల్డ్ ట్రంప్‌కు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌యే స్వయంగా వైట్ హౌజ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ప్రకటించారు. 

అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు సిద్ధమైన ట్రంప్ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు నిపుణుల సహాయం కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

వ్యవసాయం, బ్యాంకింగ్, నిర్మాణం, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్యం, సేవలు, పారిశ్రామిక రంగం, రిటైల్, టెక్నాలజీ, టెలికమ్యునికేషన్, రవాణా, తదితర రంగాల అభివృద్ధకి ఏం చేయాలనే దానిపై అగ్రరాజ్యాధినేతకు వీరు తమ  సూచనలు చేయనున్నారు. 

"నా అభ్రిప్రాయంలో వీరందరూ వారి వారి రంగాల్లో ప్రతిభావంతులు, అర్థిక వ్యవస్థను పట్టాలేక్కించేందుకు వారు మనకు కొత్త కొత్త సలహాలు ఇస్తారు" అని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వంటి ఎందరో ప్రముఖలు కూడా ఈ ట్రంప్ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. 

సత్యానాదేళ్ల, సుందర్ పిచాయ్‌తో పాటూ భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ట (ఐబీఎమ్), సంజయ్ మెహ్రోత్ (మైక్రాన్). ట్రంప్ టీంలో భారత సంతితికి చెందిన వారు మొత్తం ఆరుగుతు ఉన్నారు. ఒక్కో రంగం అభివృద్ధికి కోసం ఆయా రంగంలోని నిపుణులు ట్రంప్‌కు సూచనలు సలహాల రూపంలో సాయం చేయనున్నారు.