లాక్‌డౌన్‌ లో ఏప్రిల్ 20 నుండి పలు సడలింపులు 

లాక్‌డౌన్‌ కొనసాగింపుపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలు కొనసాగిస్తూ మరికొన్ని జోడించింది.  ఈ సందర్భంగా పలు సడలింపులు కూడా ప్రకటించింది. ముఖ్యంగా ఈ క్రింది అనుమతులు ప్రకటించింది. 

 * దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి

 * గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లలోని  పరిశ్రమల నిర్వహణకు అనుమతి 

  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి
  • ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
  • విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలకు అనుమతి 
  • వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
  • అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి
  •  పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి
  • నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి
  • కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్‌ పవర్‌కు అనుమతి
  • పట్టణ పరిధిలోని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి
  •  అన్ని రకాల ఈ-కామర్స్‌ సర్వీసులకు అనుమతి 

ఈ క్రింది నిషేధాలు, ఆంక్షలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి 

 

* విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ 

* రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్

* పబ్లిక్‌లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి

* హాట్‌స్పాట్‌లలో నిబంధనలు మరింత కఠినం

* హాట్‌స్పాట్‌లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదే

* హాట్‌స్పాట్‌లలో జనసంచారం ఉండొద్దు

* మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం

* సభలు  సమావేశాలకు అనుమతి లేదు

* విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు\

* మాల్స్‌, సినిమా హాళ్లు, పార్క్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేత

* అన్ని రకాల సభలు, సమావేశాలు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌పై నిషేధం 

* అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనవద్దు

* లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు

* కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి

* 10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం

* సోషల్‌ డిస్టెన్స్‌ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం

* ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి

* విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి

* వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి

* ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. 

* వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదని, 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది.