మరో 33 లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లు 

కరోనా టెస్టులకు సంబంధించిన ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, దేశంలో ఇప్పటికే ఆరు వారాలకు సరిపోను టెస్టింగ్‌ కిట్లు  ఉన్నాయని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 

అదనంగా 33 లక్షల ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు, 37 లక్షల ర్యాపిడ్‌ కిట్స్‌ కోసం ఆర్డర్‌ చేస్తున్నామని భారత వైద్యవిధాన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన  అధికారి రమణ్‌ ఆర్‌ గంగాఖేద్కర్‌ తెలిపారు. 

ఇవి తొందర్లోనే మనకు అందుతాయని ఆయన వెల్లడించారు. సోమవారం వరకు దేశవ్యాప్తంగా 2,31,902 కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు.