లాక్‌డౌన్‌  కొనసాగింపు స్వాగతించిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్వాగతించింది. కరోనా కట్టడికి సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్‌ డైరెక్టర్‌ పూనం కేత్రపాల్‌సింగ్‌ కొనియాడారు.  

లాక్‌డౌన్ కారణంగా సామాజిక దూరం పాటించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. కరోనా లక్షణాలున్నవారిని సులువుగా గుర్తించేందుకు కూడా మార్గం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.   

మరోవంక,  కరోనాను నియంత్రించేందుకు భారత్‌ చేస్తున్న పోరాటం అద్భుతమని ఆమె ప్రశంసించారు. దేశంలో కరోనా విస్తరించకుండా భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొంటున్నదని మెచ్చుకున్నారు.  

అయితే భారత చర్యల ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుంది చెప్పారు. కాని ఆరువారాల లాక్‌డౌన్‌తోపాటు సామాజిక దూరం, వైద్యసేవల విస్తరణ, రోగులకు ఐసోలేషన్‌, రోగులను గుర్తించటంలో చూపుతున్న వేగం వల్ల వైరస్‌ వ్యాప్తి అరికట్టడం సాధ్యమవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.