అన్ని విమాన, రైలు సర్వీసులు రద్దు  

లాక్‌డౌన్ మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో అన్ని విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇందులో ప్రాంతీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. 

అయితే కరోనా నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు అవసరమైన మందులు, కిట్లు, ఇతర అత్యవసర సామాగ్రి సరఫరాకు కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వివిధ దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలతో పాటు ఇతర రక్షణ పరికరాల సరఫరాకు కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉంచారు.    

కాగా, మే 3వ తేదీ వరకూ దేశంలో అన్ని ప్రీమియమ్, మెయిల్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత రైల్వేశాఖ. వీటితో పాటు అన్ని సబర్బన్ రైళ్లు కోల్ కతా మెట్రో, కొంకణ్ రైల్వే సహా అన్ని రైలు సర్వీసులు రద్దు అయ్యాయని తెలిపింది.