పాక్ లో మైనారిటీలకు ఆహార కొరత 

దేశంలో కరోనా వ్యాప్తి మధ్య మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులకు ఆహారం కొరత ఎదుర్కొంటున్నట్లు అమెరికా  ఇంటర్‌నేషనల్‌ రిలిజియన్‌ ఫ్రీడమ్‌ తెలిపింది. ఈ చర్యల ఖండించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ అనురిమా భార్గవ పిలుపిచ్చారు. కోవిడ్‌ 19 వ్యాప్తి కారణంగా బలహీనవర్గాలు పాకిస్థాన్‌లో ఆకలితో పోరాడుతున్నాయని పేర్కొన్నారు. 

ఒక విశ్వాసం కారణంగా ఆహార సహాయం చేయడానికి నిరాకరించకూడదని, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి వారికి హక్కులు ఉన్నాయని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలకు ఆహార సహాయం ఇతరులతో సమానంగా అందేవిధంగా చూడటం ప్రభుత్వ బాధ్యత అని హితవు పలికారు. కొద్దిపాటిగా ఉన్న హిందూ మైనారిటీలు పాకిస్థాన్‌లో తరుచూ తమ హక్కులను కోల్పోతున్నారని చెప్పారు. 

కరాచీలో నిరాశ్రాయులైన వలస కూలీలకు ప్రభుత్వేతర సంస్థ అయిన సాయిలానీ వెల్ఫేర్‌ ఇంటర్నేషన్‌ ట్రస్ట్‌ హిందువులకు, క్రైస్తువులకు సహాయం చేయడానికి నిరాకరించినట్లు, వారు ముస్లీలకు మాత్రమే సహాయం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దృష్టిలో పెట్టుకోవాని కోరుతో లేని పక్షంలో  మత వివక్ష కారణంగా కలహాలు రేగే అవకాశం ఉందని హెచ్చరించారు. 

పాకిస్థాన్‌లోని హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనార్టీలు నిరంతరం బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాల వేధింపులకు, సాంఘీక బహిష్కరణకు గురవుతున్నారని యూఎస్పీఆర్‌ఎఫ్‌ తన 2019 నివేదికలో పేర్కొంది. తాజా సమాచారం ప్రకారం పాకిస్థాన్‌లో 5,537 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 96 మంది మరణించారు.