నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వినియోగ భారతి

భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎం ఎస్)కు అనుబంధంగా ఉన్నవినియోగ భారతి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని పలు కాలనీల్లో ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

నగర పరిధిలోని రూరల్ పి నైనవరం గ్రామం , సుందరయ్య నగర్ నిరుపేదలకు రెండు కిలోల బియ్యం, నూనె తోపాటు 6 రకాల కూరగాయలు అందించారు.

వినియోగ భారతి సిబ్బంది గత రెండు రోజులుగా పర్యటించి పలు ప్రాంతాల్లో నిరుపేదల జాబితా రూపొందించారు. దీని  ఆధారంగా వారికి   కూరగాయలు,నిత్యావసర సరుకులతో పాటు కొందరికి దుస్తులు కూడా పంపిణీ అందించారు.  

ఈ లబ్ధిదారుల ఎంపికలో సహకరించిన గ్రామ పెద్దలకు అక్కడ ఉన్న అవసరాన్ని తమ దృష్టికి తెచ్చిన ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ సుధాకర్ , వస్తు, నగదు రూపంలో అందించిన దాతలకు, వస్తువుల పంపిణీ కి వాహనాన్ని సమకూర్చిన 'సేవాభారతి' వారికి వినియోగ భారతి  ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.