పాత బస్తీలో నిత్యావసర వస్తువుల పంపిణి 

కరోనా మహమ్మరిని అరికట్టడానికి  దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును ప్రజలంతా గౌరవిస్తూ పాటించడం అభినందనీయం అని , కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొదగించడం స్వాగతస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ లోని పాతబస్తీలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణి చేస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ప్రతి రోజు పేదలకు నిత్యవసర వస్తువులు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా ముందు వరుసలో ఉండి సేవ చేస్తున్నారని కొనియాడారు.  

కరోనా మహమ్మరిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పెరిగిన లాక్ డౌన్ కాలంలో సైతం బీజేపీ కార్యకర్తలు సేవ కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. 

సామాజిక దూరం పాటిస్తూనే , ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వలస కూలీలకు, కార్మికులకు, పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, నర్సులకు, డాక్టర్లకు, పోలీసులు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు.  

కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పేదలు ఆకలితో అలంటించ కుండా బీజేపీ కార్యకర్తలు ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుండలని పిలుపునిచ్చారు.